ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య బారసాల కూడా నిర్వహించి పాపకు పేరు పెట్టారు. భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేశారు. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ..అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ముద్దులు కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్యూర్ వైట్ గౌనులో ఉన్న భూమి దీపక్ రావ్.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ చాలా అందంగా ఉంది.
ఇక హరితేజ విషయానికొస్తే..బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది.
. తనకున్న క్రేజ్‌తో బిగ్‌బాస్ మొదటి సీజన్‌లోనూ అడుగు పెట్టిన ఆమె తన అల్లరితో, ఆటతో మరెంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించింది.
Comments
Please login to add a commentAdd a comment