ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఏప్రిల్ 5న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ వీడియోలు పెడూతూ చాలా యాక్టీవ్‌గా ఉండే హరితేజ.. పాప పుట్టిన తర్వాత ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఓ ఎమోషనల్ వీడియోని అభిమానులతో పంచుకుంది. డెలివరీ సమయంలో తాను పడిన కష్టాలను వివరిస్తూ ఓ సుదీర్ఘమైన వీడియోని పోస్ట్ చేసింది. పాప పుట్టే వారం రోజుల ముందు తనతో పాటు కుటుంబ సభ్యలందరికి కరోనా పాజిటివ్ అని తేలిందని, ఒంటరిగా డెలివరీకి వెళ్లానని చెప్పుకొచ్చింది.
‘పాప పుట్టిందని తెలియగానే చాలా మంది విషేష్ చెప్పారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు లేను. ఇప్పడు చెప్పుతున్న మీ అందరికి థ్యాంక్స్. అప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వలేదో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయం పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తూఉంటే.. నా విషయం చెప్పుకోవాలనిపించింది. నా వల్ల కొంతమంది అయినా మారుతారేమోనని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. నా డెలివరీకి ఒక్క వారం ముందు ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. ఏం చేయలో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ జాగ్రత్తగాలేకపోవడం వల్లే ఇలా అయిందని అనిపించింది. అప్పుడు నేను చాలా ఇబ్బందికి గురయ్యా. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లే డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు. దాంతో కోవిడ్ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. రిజల్ట్ కోసం రాత్రిళ్లు రాత్రిళ్లు ఎదురు చూశా. డెలివరీ అంటే సంతోషంగా ఉంటుంది. డెలివరీ టైంలో ఒక్కదాన్నే పోరాడాను. దీపు ఒక్కడే చూసుకున్నాడు. కోవిడ్ వార్డులో ఒక్కదాన్నే ఉన్నాను. బేబీ పుట్టగానే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. పాపని వీడియో కాల్‌లో చూడాల్సి వచ్చింది. చాలా బాధను అనుభవించాను. మా వాళ్లు అంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో మాకు కొంతమంది స్నేహితులు సాయం చేశారు. ప్రెగెన్సీ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. మన వల్ల మనతో పాటు పక్కవాళ్లకు ఇబ్బంది కలుతుంది. ముందే జాగ్రత్తగా ఉండండి. బయట తిరగకండి’అంటూ హరితేజ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment