జబర్దస్త్‌లో హరితేజ ఇన్‌, రష్మీ అవుట్‌! | hari teja replace rashmi gautam in jabardasth | Sakshi
Sakshi News home page

జబర్దస్త్‌లో హరితేజ ఇన్‌, రష్మీ అవుట్‌!

Published Thu, Oct 12 2017 7:59 AM | Last Updated on Thu, Oct 12 2017 8:33 AM

hari teja replace rashmi gautam in jabardasth

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ షో హరితేజకు మంచి క్రేజ్‌తో పాటు యాంకర్‌ అవకాశాలను తెచ్చిపెడుతోంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో హరితేజ టాలెంట్‌ చూసి అవకాశాలు క్యూ కడుతున్నాయని బుల్లితెర సమాచారం. వెండి తెరపై ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్,  బుల్లి తెరపై ఒక్క షో తోనే సొంతం చేసుకోవచ్చు అనేది యాంకర్లకు ఉన్న గట్టి నమ్మకం. గతంలో జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా అనసూయ, రష్మీ గౌతమ్‌లు మంచి క్రేజ్‌ సంపాందించుకున్నారు. ఇప్పుడు ఆజాబితాలో బిగ్‌బాస్‌ షో ఫేం హరితేజ సైతం జబర్దస్త్‌ షోకు వ్యాఖ్యతగా రాబోతోందని బుల్లితెర గుసగుసలు.

ఈ నేపథ్యంలో మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న జబర్దస్త్‌ షో కు హరితేజను యాంకర్‌గా తీసుకొన్నారని సమాచారం. షోకు ప్రేక్షకుల ఆదరణ దృష్టిలో పెట్టుకొని హరితేజ కూడా ఆ షోకి యాంకర్‌గా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. కొద్ది ఏళ్ల నుంచి రష్మీ ఈ షోకు యాంకర్‌గా చేస్తోంది. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ పై వస్తున్న విమర్శలు, హరితేజ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని మల్లెమాల సంస్థ హరితేజకు యాంకర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే మరో టాక్‌ కూడా నడుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌2లో అవకాశం రావడంతో రష్మీ స్వయంగా తప్పుకొందని టాక్‌. ఏదేమైనా మొత్తానికి జబర్దస్త్‌షో లో హరితేజ యాంకర్ గా అడుగు పెట్టడం మాత్రం దాదాపు ఖరారైందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement