
Actress Hari Teja Home Tour Video: ఈ మధ్య సినీ, టీవీ తారలంతా యూట్యూబర్లుగా మారిపోతున్నారు. లాక్‌డౌన్‌లో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా ఆదాయం పొందుతున్నారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని, వంటలు, వారి విలాసవంతమైన భవనాలను చూపిస్తూ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మీ హోం టూర్ ద్వారా తన ఇంటి మొత్తాన్ని చూపించిన సంగతి తెలిసిందే.
ఈ వీడియోకు కొద్ది రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిరుపమ్ భార్య మంజుల కూడా తమ ఇల్లు చూపించింది. ఇలా పలువురు సెలబ్రిటీలు హోం టూర్ ద్వారా వారి ఇంటి ప్రత్యేకతను, ఖరీదైన వస్తువులను చూపిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్‌బాస్ ఫేం, టీవీ నటి హరితేజ కూడా తన ఇంటిని చూపిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తన యూట్యూబ్ చానల్ ‘హరి కథలు’ ద్వారా ఇంటి విశేషాలను పంచుకుంది. తనకు నచ్చినట్టుగా అందంగా ఇంటిని డిజైన్ చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఇంటి గుమ్మం దగ్గరి నుంచి హాల్, కిచెన్, బెడ్‌రూం ఇలా తన ఇంటిలోని ప్రతి వస్తువులను చూపిస్తూ వాటి గురించి వివరించింది. హరి తేజ ఇల్లు చూస్తే మీరు కూడా బాబోయ్ అనకుండా ఉండలేరు.
స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్న ఆమె ఇంటిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎంత బాగుంది! ఈ ఇంటి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతగా కళ్లు చెదిరెలా విలాసవంతంగా ఉన్న తన ఇంటిని ఖరీదైన వస్తువులతో అలంకరించుకుంది. అయ్య బాబోయ్ అంటూ నోరు తెరిపించేలా ఉన్న ఆమె ఖరీదైన భవనం ఎలా ఉంది? ఇంకా ఆమె ఇంటి ప్రత్యేకతను మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడ ఓ లుక్కేయండి.






Comments
Please login to add a commentAdd a comment