Allu Arjun Special Birthday Wishes To His Daughter Allu Arha, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun Shares Arha Video: కూతురు బర్త్‌డే.. అర్హ కందిరీగ వీడియో షేర్‌ చేసి మురిసిపోయిన బన్నీ

Published Mon, Nov 21 2022 2:48 PM | Last Updated on Mon, Nov 21 2022 3:28 PM

Allu Arjun Birthday Wishes to Daughter Allu Arha With Cute Video - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి  అల్లు అర్హ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా కూతురికి సంబంధించిన ఓ వీడియో షేర్‌ చేస్తూ అర్హకు క్యూట్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా అర్హకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ కూడా ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లాడిలా మారిపోతాడు బన్నీ. ఇప్పటికే అర్హకు సంబంధించిన పలు క్యూట్‌ వీడియోలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్‌ చూస్తే షాకవ్వాల్సిందే

నవంబర్‌ 21 అర్హ బర్త్‌డే స్పందర్భంగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో అర్హ తన క్యూట్‌ క్యూట్‌ మాటలతో తండ్రికి కందిరీగల గురించి చెబుతూ కనిపించింది. కందిరిగలు వాళ్ల జుట్టులోకి వెళ్లిపోతున్నాయని చెబుతుంటే.. తెనె పుట్ట ఎక్కడుందని బన్నీ కూతురి అడగ్గా.. ఎక్కడంటే కింద ఉంది. వాళ్లు పొగ పెట్టి తెనె పుట్ట తీసేశారని చెప్పింది. తండ్రిని తీసుకుని కిందికి తీసుకుని వెళ్లింది అర్హ. తన కూతురికి కందిరీగలు అంటే భయపడొద్దని చెబుతుంటే.. అక్కడ చాలా ఎక్కువ కందిరీగలున్నాయని, అవి కుడుతున్నాయ్‌ అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోని బన్నీ పోస్ట్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై క్యూట్ బేబీ అర్హ’ అటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement