
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి, బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే అర్హ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది.
త్వరలోనే ఈ చిన్నారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నట్లు సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో కనిపించనుందట. ఈ కథకు అర్హ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. దీంతో అల్లు ఫ్యామిలీని దిల్‌రాజు ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అర్హ టాలీవుడ్‌కు పరిచయం అవబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment