Allu Arjun Daughter Allu Arha in Mahesh Babu, Trivikram Movie - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Allu Arha: మహేశ్‌-త్రివిక్రమ్‌ సినిమాలో అల్లు అర్హ స్పెషల్‌ రోల్‌?

Published Wed, Jan 4 2023 1:00 PM | Last Updated on Wed, Jan 4 2023 3:12 PM

Allu Arjun Daughter Allu Arha Plays a Key Role Mahesh Babu, Trivikram Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీం సైతం క్లారిటీ ఇచ్చింది. జనవరిలో  ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) రెండో షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్‌.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ చిన్నారిది స్పెషల్‌ రోల్‌ ఉంటుందట. దాని కోసం త్రివిక్రమ్‌ అర్హను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాడని తెలుస్తోంది. అంత ఓకే అయితే అర్హ కొద్ది నిమిషాల పాటు ఈ సినిమాలో అలరించనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా అర్హ ఇప్పటికే శాకుంతలం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలంలో అర్హ భరతుడి పాత్ర పోషించిందని సమాచారం.

చదవండి: 
తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ కీలక ప్రకటన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement