Allu Arjun Daughter Allu Arha Huge Remuneration For Jr NTR Devara Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arha Remuneration For Devara Movie: రెండో సినిమాకే నిమిషానికి రూ.2 లక్షలు, బన్నీ కూతురా, మజాకా!

Published Sun, Jul 16 2023 10:47 AM | Last Updated on Sun, Jul 16 2023 11:07 AM

Allu Arha Huge Remuneration for Devara Movie - Sakshi

మిగతా ఇండస్ట్రీల మాటేమిటో కానీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చలనచిత్రపరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు హీరో హీరోయిన్స్‌గా, దర్శకనిర్మాతలుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ముందుకు సాగుతుంటారు. చాలామంది ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యారు కూడా!ఎవరో కొద్ది మంది మాత్రమే వారి సంతానాన్ని సినిమా దరిదాపుల్లోకి కూడా రానివ్వరు.

ఇకపోతే ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార ఓ యాడ్‌లో నటించి ఒక్కసారిగా వైరలయింది. ఇందుకోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 11 ఏళ్లకే యాడ్స్‌ మొదలుపెట్టిందంటే మరికొంతకాలానికి సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అటు మహేశ్‌ తనయుడు గౌతమ్‌ కూడా ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని నమ్రత క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు అల్లు అర్జున్‌ కూతురు అర్హ శాకుంతలం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. భరతుడిగా నటించి సిల్వర్‌ స్క్రీన్‌పై రాజసాన్ని పండించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

తాజాగా ఈ చిన్నారి జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందట. వచ్చే నెలలో తను షూటింగ్‌లో పాల్గొననున్నట్లు భోగట్టా! ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలేనని, మేకర్స్‌ నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన దేవర సినిమాకు ఆమె 20 లక్షల పారితోషికం తీసుకోనుందన్నమాట! మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

చదవండి: జవాన్‌ సినిమాకు నయనతార ఎంత పారితోషికం తీసుకుందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement