అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాలుగేళ్ల ఈ చిన్నారి ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వయసులోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. కాగా ఈ చిన్నారి చేష్టలను అప్పుడప్పుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు.
ఆ వీడియోలో అర్హ.. చెస్ ఆడాటానికి సిద్ధం అవుతూ.. పావులను సెట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ చెస్ కోసం పావులను సిద్ధం చేయడం చూసి ఆమెను అభినందిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే అర్హకు ఎంత తెలివో.. సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
చదవండి:
నాగచైతన్య కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం!
సింగిల్ అంటు కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు
Comments
Please login to add a commentAdd a comment