Allu Arjun Daughter Arha Kick Starts Dubbing For Shaakuntalam Movie, Pics Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun daughter Arha: డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్హ.. సోషల్ మీడియాలో వైరల్

Published Wed, Jan 18 2023 9:40 PM | Last Updated on Thu, Jan 19 2023 9:17 AM

Allu Arjun daughter Arha kickstarts dubbing for Shaakuntalam Movie - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్‌లో తెలియని వారుండరు. ఇప్పటికే సమంత నటిస్తున్ శాకుంతలం సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన శాకుంతలం ట్రైలర్‌లో సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా అర్హ కనిపించింది. తాజాగా అర్హ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే ఆరో ఏట అడుగు పెట్టిన అల్లు అర్హ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

 

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు.  నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాకుంతలం చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. మరోవైపు మహేశ్ బాబు మూవీ‘ఎస్ఎస్ఎంబీ28’(SSMB28) చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్హ నటిస్తున్నట్లు టాక్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement