Samantha says Allu Arjun isn't involved in decision making for Allu Arha - Sakshi
Sakshi News home page

అర్హ విషయంలో అల్లు అర్జున్‌ జోక్యం చేసుకోరు: సమంత

Published Sat, Apr 8 2023 8:12 AM | Last Updated on Sat, Apr 8 2023 8:36 AM

Samantha Says Allu Arjun Not involved In Decision Making for Daughter Arha - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’మూవీ ఈ నెల 14న విడుదల కాబోతంది. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్‌ దర్శత్వం వహించారు.  ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌, మోహన్‌ బాబు ఇతర  కీలక పాత్రలు పోషించారు. 

ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తుంది.  సినిమా ప్రమోషన్స్‌ కోసం ముంబై వెళ్లిన సామ్‌.. అల్లు అర్హ  కెరీర్‌ విషయం అల్లు అర్జున్‌ ప్రమేయం గురించి స్పందించింది. కూతురు కెరీర్‌ విషయంలో అల్లు అర్జున్‌ జోక్యం చేసుకోలేడని తాను భావిస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. ‘అర్హకు సొంత వ్యక్తిత్వం ఉంది. తన కెరీర్‌ ఎలా ఉండాలో ఆమె నిర్ణయించుకుంటుంది. తనలో చాలా టాలెంట్‌ ఉంది. పెద్ద పెద్ద డైలాగ్స్‌ కూడా ఈజీగా చెప్పేస్తుంది.  పిల్లలందరూ అర్హ పాత్రకు కనెక్ట్‌ అవుతారు’ అని సమంత చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement