Its Official! Samantha's Shaakuntalam Postponed, Makers release a statement - Sakshi
Sakshi News home page

Samantha Shaakuntalam Postponed: అఫీషియల్‌.. సమంత శాకుంతలం వాయిదా

Published Tue, Feb 7 2023 3:38 PM | Last Updated on Tue, Feb 7 2023 4:02 PM

Official: Samantha Shaakuntalam Postponed, Makers Release Statement - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ శాకుంతలం. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్‌, వరుడు ఎవరంటే!

ఈ క్రమంలో ఆడియన్స్‌కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్‌ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది.

చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తు‍న్నారు: కిరాక్‌ ఆర్పీ

అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్‌ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement