Pushpa Pre Release Event: Allu Ayaan And Arha Cute Moments, See Allu Arjun Reaction - Sakshi
Sakshi News home page

Pushpa Pre Release Event: సందడి చేసిన అల్లు అయాన్‌, ఆర్హ, మురిసిపోయిన బన్నీ

Published Mon, Dec 13 2021 11:33 AM | Last Updated on Mon, Dec 13 2021 12:12 PM

Allu Arjun Son Ayaan And Arha At Pushpa Movie Pre Release Event - Sakshi

Allu Arha And Allu Ayaan: అల్లు అర్జున్‌ తాజా చిత్రం పుష్ప మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతో పాటు నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన బహుమతి అంటూ అల్లు అర్జున్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపంచాడు. ఈ వెంట్‌లో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్‌ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌తో పాటు మిగతా తారగణం పాల్గొంది. కానీ దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మాత్రం రాలేకపోయారు.

చదవండి: సమంతకు థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ

ఈ ఈ ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో రష్మిక తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, డ్యాన్స్‌, మాటలతో సందడి చేసింది. ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారెవరో కాదు ఐకాన్‌ స్టార్‌ తనయుడు అయాన్‌, తనయ ఆర్హ. తండ్రితో పాటు ఈవెంట్‌కు వచ్చిన అయాన్, అర్హలు ఈ వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. అల్లు అర్హ, అల్లు అయాన్‌లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ అయితే స్పెషల్‌గా నిలిచాయి. 

చదవండి: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌ డీల్‌!

స్టేజ్‌పై వచ్చిన వారిని హోస్ట్‌ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్‌ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్‌ ఇచ్చింది. వెంటనే ‘ హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు అయాన్‌. ఆ తర్వాత ఆర్హ సైతం మైక్ తీసుకుని నమస్తే అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. ఇలా అయాన్‌, ఆర్హలు వచ్చి క్యూట్‌ క్యూట్‌ తండ్రి డైలాగ్‌ చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అయాన్‌, ఆర్హల అల్లరిని చూసి తండ్రి అల్లు అర్జున్‌, తాత అల్లు అరవింద్‌లు మురిపిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement