
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ అల్లువారి ముద్దుల తనయ సంబంధించిన మేకప్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అర్హ ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంది అర్హ. కారవాన్‌లో అర్హ క్యూట్‌గా మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు టీం. మేకప్ వేస్తుండగా భలే ముద్దుగా కూర్చుని ఉంది అర్హ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
#AlluArha is back on the sets. The little Prince Bharata joins the ongoing schedule of the mythological drama #Shaakuntalam, which is currently underway in Hyderabad @alluarjun @Samanthaprabhu2 @Gunasekhar1@neelima_guna @neeta_lulla @GunaaTeamworks pic.twitter.com/l03FKZFBrK
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 3, 2021
Comments
Please login to add a commentAdd a comment