Allu Sneha Reddy Shares Arha First Day School Photo; Photo Viral - Sakshi
Sakshi News home page

Allu Arha: అల్లు అర్హ ఫస్ట్‌ డే స్కూల్‌ ఫోటో చూశారా?

Published Wed, Aug 9 2023 2:30 PM | Last Updated on Wed, Aug 9 2023 3:26 PM

Allu Sneha Shares Arha First Day School Photo - Sakshi

అర్హ వేసుకున్న బ్యాగు మీద కూడా ఈ చిన్నారి పేరు ఇంగ్లీష్‌లో ఉంది. అర్హ స్కూలు పాఠాలకు ముందే సినిమా పాఠాలు సైతం నేర్చేసుకుంటోంది. శాకుంతలం సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు అభిమా

అల్లు అర్జున్‌ గారాలపట్టి అర్హ ఇక అల్లరి మాని స్కూలుకు వెళ్తోంది. ఇప్పటివరకు అమ్మానాన్నతో కబుర్లు చెప్తూ, ఆటలాడుతూ కాలక్షేపం చేసిన అర్హ చదువుకునే వేళైంది. ఈ రోజు ఉదయం అర్హ స్కూలుకు వెళ్లింది. ఈ విషయాన్ని అల్లు స్నేహ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. అయాన్‌తో కలిసి బుద్ధిగా బడికి వెళ్తున్న కూతురి ఫోటోను 'ఫస్ట్‌ డే ఆఫ్‌ స్కూల్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది.

ఇందులో అయాన్‌ బ్యాగ్‌పై తన పేరు రాసి ఉండగా.. అర్హ వేసుకున్న బ్యాగు మీద కూడా ఈ చిన్నారి పేరు ఇంగ్లీష్‌లో ఉంది. వీరి బ్యాగులను బన్నీ దంపతులు ప్రత్యేకంగా డిజైన్‌ చేయించినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ స్కూలుకు వెళ్తున్న ఫోటో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ భలే ముద్దుగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అర్హ స్కూలు పాఠాలకు ముందే సినిమా పాఠాలు సైతం నేర్చేసుకుంది. శాకుంతలం సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.

మరోవైపు కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలోనూ అర్హ నటించనున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. జాన్వీ కపూర్‌ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనుందని, ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు కాగా ఇందుకోసం ఏకంగా రూ.20 లక్షలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది! మరోవైపు అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

చదవండి: అరుదైన వ్యాధితో బాధపడ్డ మహేశ్‌బాబు, ఎన్ని టాబ్లెట్లు వాడినా..
హైపర్‌ ఆది ఓవరాక్షన్‌.. చిరంజీవిని జీరోగా.. గుర్రుమంటున్న మెగా ఫ్యాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement