
పుష్పకు ముందు అల్లు అర్జున్ పేరు టాలీవుడ్ , మాలీవుడ్ లోనే రిపీటెడ్ గా వినిపించేది. కాని పార్ట్ 1 రిలీజైన తర్వాత బన్ని క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా మారింది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంచనాలకు మించి ఉత్తరాదిన రూ.100 కోట్లు కొల్లగొట్టి మరోసారి టాలీవుడ్ సత్తాని చూపించాడు.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. సెలబ్రెషన్స్ కోసం దుబాయ్ వెళ్లి.. అక్కడి అందాలను ఆస్వాదించాడు. దాదాపు 16 రోజుల తర్వాత అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా బన్నీకి ఆయన ముద్దుల తనయ అల్లు అర్హ వెరైటీ స్వాగతం పలికి సర్‌ప్రైజ్ చేసింది. గులాబీ పూల రెక్కలు, ఆకులతో ‘వెల్కమ్ నాన్న’అని రాసి బన్నీకి ఇంట్లోకి స్వాగతం చెప్పింది. తన కూతురు చెప్పిన వెరైటీ స్వాగతానికి అల్లు అర్జున్ మురిపిపోయాడు. ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. ‘పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment