భరతుడిని కలిసిన 'పుష్ప'.. బన్నీ ఎమోషనల్‌ పోస్ట్‌ | Allu Arjun Emotional Post After Meet Arha In Same Shooting Location | Sakshi
Sakshi News home page

ఒకే లొకేషన్‌లో అ‍ల్లు అర్జున్‌-అర్హ షూటింగ్‌

Published Mon, Aug 9 2021 6:34 PM | Last Updated on Mon, Aug 9 2021 7:46 PM

Allu Arjun Emotional Post After Meet Arha In Same Shooting Location - Sakshi

Pushpa Meets Bharata In Shakunthalam : అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్హ శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుంది. అయితే తాజాగా వీరిద్దరి షూటింగ్‌ లొకేషన్లు ఒకే దగ్గర ఉండటంతో కూతురిని చూసేందుకు బన్నీ మరోసారి శాకుంతలం సెట్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఫోటోను షేర్‌ చేస్తూ.. 'అర్హ, నేను ఒకే లొకేషన్‌లో వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నాం. ఇలాంటి రోజు ఓ 15-20 ఏళ్ల తర్వాత ఉంటుందనుకున్నా. కానీ ఇంత త్వరగా వచ్చేసింది..

పుష్ప శాకుంతలంలోని భరతుడిని కలిశాడు. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది' అంటూ బన్నీ ఎమోషనల్‌ అయ్యారు. ఇక అల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement