
Allu Arjun Visits Shakunthalam Sets: సమంత, గుణశేఖర్ కాంబినేషన్‌లో ప్రస్తుతం శాకుంతలం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్హ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక కూతురు పర్‌ఫార్మెన్స్ చూసేందుకు అల్లు అర్జున్ స్వయంగా శాకుంతలం సెట్‌కి వచ్చారు. ఈ సందర్భంగా కూతురి నటనను చూసి బన్నీ మురిసిపోయినట్లు సమాచారం. ఆల్లు అర్జున్‌తో పాటు భార్య స్నేహ రెడ్డి, కొడుకు అల్లు అయాన్‌లు కూడా సెట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలోనే అల్లు అర్హ కనిపించనున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ ఫార్ట్ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment