
టాలీవుడ్‌లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు.
ఈ రోజు (సెప్టెంబర్ 29న) స్నేహ పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్ చెబుతూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్ని.
‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్ డే క్యూటీ’ అని క్యాప్షన్‌ని దానికి జోడించాడు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి ఆమెకి సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తాయి. దీంతో ట్విట్టర్‌లో #allusnehareddy ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో మొదటి భాగం డిసెంబర్ విడుదల కానుంది. అనంతరం వేణు శ్రీ రామ్ దర్శకుడిగా ‘ఐకాన్’ మూవీ చేయనున్నాడు.
Many many happy returns of the day to the most special person in my life . . Wish to spend more n more birthdays with you . Happy birthday cutieeee... #allusnehareddy pic.twitter.com/tjy4lv63zp
— Allu Arjun (@alluarjun) September 29, 2020