టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రియారిటీ ఇస్తారో తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేస్తాడు. ఎక్కువ సమయం పిల్లలతోనే గడపడానికి ప్రయత్నిస్తాడు. సినిమాల పట్ల ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ టైమ్ ను మాత్రం అస్సలు మిస్ కాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హా అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ వెడ్డింగ్‌కి వెళ్లిన బన్నీ.. భార్య స్నేహరెడ్డితో కలిసిదిగిన పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ట్వీటర్‌తో పాటు ఇన్‌స్టా స్టోరీలో ఆ ఫోటోని షేర్ చేస్తూ... హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఉనక్కుళ్ నాన్ సాంగ్ ని కూడా జత చేశాడు. సతీమణితో కలిసి అందంగా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘పుష్ప’తో భారీ విషయాన్ని సొంతం చేసుకున్న బనీ.. ఇప్పుడు దాని కొనసాగింపు ‘పుష్ప ది రూల్’ లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లో ఫామిలీ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు.
— Allu Arjun (@alluarjun) November 19, 2022
Comments
Please login to add a commentAdd a comment