తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. 'పుష్ప'తో పాన్ ఇండియా షేక్ చేసి, నేషనల్ అవార్డు గెలుచుకున్న ఇతడు ప్రస్తుతం 'పుష్ప 2' బిజీలో ఉన్నాడు. ఇతడి భార్య స్నేహా కూడా తను ఆల్రెడీ పెట్టిన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఫుల్ బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన మెగాకోడలు లావణ్య త్రిపాఠి)
అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. భార్య స్నేహా, పిల్లలు అయాన్-అర్హ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటారు. తాజాగా అలా బన్నీ భార్య వ్యాపారం గురించి ఓ విషయం బయటకొచ్చింది. అల్లు స్నేహా స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్.. జనవరి 20న ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది.
ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్నివాల్‌లో షాపింగ్ ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ కార్నివాల్ ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అల్లు స్నేహ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment