Sneha Reddy’s father felicitates Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో పుష్ప సక్సెస్ పార్టీ జరిగినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి బన్నికి పిల్లనిచ్చిన స్వంత మామగారు. ఇక ఆయన ఇప్పటి వరకు సినిమా జనాలకు, సినిమా ఫంక్షన్లకు పరిచయం తక్కువనే చెప్పాలి. అయితే తొలిసారి అల్లు అర్జున్ కోసం ఇలాంటి పార్టీ ఇచ్చారు. అంతేకాక ఆయనే స్వయంగా సినిమా జనాలను ఆహ్వానించడం విశేషం.
పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్‌ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఇక బన్ని సినిమాల విషయానికొస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత చిత్రం సంజయ్‌లీలా భన్సాలీతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment