
హ్యాపీగా... జాలీగా...
సందర్భం తెలీదు. కానీ, సంతోషం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది... అల్లు స్నేహ ముఖంలో, ఆమెను పట్టుకుని వెనుక సీటులో కూర్చున్న కుమారుడు అయాన్ నవ్వులో, వీళ్లిద్దరి కంటే ముఖ్యంగా స్కూటర్‌ను పట్టుకుని గాల్లో ఎగురుతూ అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజులో.
సందర్భం తెలీదు. కానీ, సంతోషం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది... అల్లు స్నేహ ముఖంలో, ఆమెను పట్టుకుని వెనుక సీటులో కూర్చున్న కుమారుడు అయాన్ నవ్వులో, వీళ్లిద్దరి కంటే ముఖ్యంగా స్కూటర్‌ను పట్టుకుని గాల్లో ఎగురుతూ అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజులో. అర్హ (అల్లు అర్జున్ కుమార్తె) చిన్న పిల్ల కదా... ఏం జరుగుతుందో పసిగట్టలేని పసిపిల్ల. ముద్దుగా అమ్మ ఒడిలో కూర్చుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే... స్నేహ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, అయాన్ పుట్టిన తర్వాత సేమ్ టు సేమ్ ఇలాంటి ఫొటోలే దిగారు. ఇప్పుడు అర్హతో కలసి మళ్లీ ఫొటోలు దిగారు. హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు కదూ!