
Allu Arjun Celebrate 11th Marriage Anniversary Wishes To Sneha Reddy: టాలీవుడ్‌లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరూ ప్రేమ చూపించడంలో ఎవరికీ వారే సాటి. అయితే ఆదివారం (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి రోజు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, ఏడడుగులు నడిచి నేటికి 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ.
అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ పిల్లలతో కేక్ కట్ చేస్తున్న ఫొటో షేర్ చేస్తూ 'పెళ్లి రోజు శుభాకాంక్షలు క్యూటీ. మనిద్దరి ఈ బంధానికి 11 వసంతాలు.' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కాగా శ్రుతిహాసన్తోపాటు పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ రూపంలో విషెస్ తెలుపుతున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పార్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment