
స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మూవీ అప్‌డేట్స్‌తో పాటు తన కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం బన్నీకి అలవాటు. ఈ క్రమంలో తన గారాల పట్టి అర్హా పుట్టినరోజు సందర్భంగా బన్నీ ట్విటర్‌లో చేసిన పోస్ట్ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తెగ ఆకర్షిస్తోంది.
తన కూతురి రెండో పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేస్తున్న ఈ మెగా హీరో... ‘ హ్మాపీ బర్త్‌డే మై చబ్బీ డాల్ అర్హా.. ఈరోజు తను రెండో వసంతంలోకి అడుగుపెడుతోంది’ అంటూ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అర్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘లిటిల్ ప్రిన్సెస్‌కు శుభాకాంక్షలు.. అలాగే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ చెబితే మీతో పాటు మేం కూడా కేక్ కట్ చేస్తాం’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా టాలీవుడ్ స్టైలిష్ కపుల్ అల్లు అర్జున్- స్నేహారెడ్డిలకు ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2014లో అయాన్‌కు, 2016లో అర్హాకు జన్మనిచ్చారు.
Happy Birthday to my chubby doll Arha ... Turning Two Today ... Muuaaahhhh ! pic.twitter.com/JUDvbg8ITg
— Allu Arjun (@alluarjun) November 21, 2018
Comments
Please login to add a commentAdd a comment