![Allu Arjuns Daughter Arha Chooses Alia Bhatt Ss Favourite Actress Over Jacqueline - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/27/allu.jpg.webp?itok=kdipdxem)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాలుగేళ్లవయసులోనే తన మాటలు, చేష్టలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా అర్హకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడగ్గా మొదట జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అని చెప్పిన అర్హ.. దాని స్పెల్లింగ్ చెప్పమంటే మాత్రం లేదు లేదు..నా ఫేవరెట్ హీరోయిన్ ఆలియా భట్ అంటూ మాట మార్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది.
ముఖ్యంగా అర్హ ఎక్సెఫ్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలోనూ బెండకాయ్, దొండకాయ్ నువ్వే నా గుండె కాయ్, రాములో రాముల పాటకు దోస స్టెప్ అంటూ అల్లు అర్జన్- అర్హ మధ్య సాగిన సంభాషణలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ఫ. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు బన్నీ.
చదవండి : కూతురు బర్త్‌డేకు సర్‌ఫ్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్
‘బాలీవుడ్’ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ మూవీ రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment