ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తిరుమలలో ప్రగతి, నందిని రెడ్డి
స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Allu Arjun Wife Sneha Reddy: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి!https://t.co/jc53pf3pku#AlluArjun #allusnehareddy #SnehaReddy #tirumala #TTD #MovieNews #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday #Trending
— Sakshi (@sakshinews) January 29, 2024
Comments
Please login to add a commentAdd a comment