Tirupati Balaji temple
-
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల శ్రీవారి సేవలో స్నేహా రెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమలలో ప్రగతి, నందిని రెడ్డి స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Allu Arjun Wife Sneha Reddy: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి!https://t.co/jc53pf3pku#AlluArjun #allusnehareddy #SnehaReddy #tirumala #TTD #MovieNews #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday #Trending — Sakshi (@sakshinews) January 29, 2024 -
శ్రీవారిని దర్శించుకున్న నందినీ రాయ్
సాక్షి, తిరుమల: సినీ నటులు నందినీ రాయ్, గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వీరిని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత నందినీ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తుడికి శానిటైజేషన్ అందేలా టీటీడీ చేసిన ఏర్పాట్లను కొనియోడారు. స్వామి వారిని చాలా రోజుల తర్వాత దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార ప్రవేశం చేశానని, తర్వాత స్వామి వారిని దర్శించుకుని వెళ్లాక నాకు మొత్తం ఎనిమిది సినిమా ఆఫర్లు రావడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మళ్లీ వచ్చానన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి వైభవాన్ని చాటి చెప్తూ 40 నిమిషాల నిడివి గల పాటను రూపొందిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. (చదవండి: కానిస్టేబుల్ ఆర్షద్‌కు టీటీడీ చైర్మన్ అభినందనలు) -
శ్రీవారిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్
-
శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్
-
శ్రీవారిని దర్శించుకున్న బన్నీ, త్రివిక్రమ్
సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బన్నీ తన కుటుంబ సభ్యులతోపాటు తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి వెంకన్నను దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బన్నీ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించాడు. (ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’) కాగా ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక క్యూట్నెస్లో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాతో బన్నీ జోడీ కట్టనున్నాడు. ఇక ఇప్పటికే దర్శకులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఈ హీరో తాజాగా బంధువులకు, సన్నిహితులకు కూడా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. కాగా ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికిగానూ బన్నీ రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. (బన్ని- సుకుమార్ చిత్ర టైటిల్‌పై క్లారిటీ!) -
తిరుమల: అరగంటలో ఆభరణాల పరిశీలన!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు సమర్పించిన వెలకట్టలేని ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం వీటిని పరిశీలించారు. అయితే అసలు ఏడుకొండలవాడికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాలపై అరగంటలో ముగించడం గమనార్హం. పాలకమండలి సభ్యులు మంగళవారం తిరుమలలో మరోసారి భేటీ కానున్నారు. రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలు శ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ సోమవారం ఆలయంలోకి వెళ్లిన టీటీడీ పాలకమండలి సభ్యులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. కనీసం రిజిస్టర్లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండానే సభ్యులు పరిశీలన పూర్తి చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలైనవేనా...? తిరువాభరణ రిజిస్టర్లో నమోదు చేసిన ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయా? వజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలెన్ని? అవన్నీ అసలైన ఆభరణాలేనా? అనేది తేలాల్సి ఉంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది డైమండ్ అదృశ్యం. శ్రీవారి హారంలో వజ్రం ఉండేదని, తరువాత దాన్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని రాములవారి ఆలయంలో అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణం బయట పడటం గతంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆభరణాలు అసలైనవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తెరదించాలంటే తూతూమంత్రంగా కాకుండా ప్రతి ఆభరణంపై నిశితంగా పరిశీలన జరగాలి. ఆభరణాలపై సభ్యుల సంతృప్తి శ్రీవారి ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని పరిశీలన అనంతరం పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయితే రిజిస్టర్ ప్రకారం అన్నిటినీ పరిశీలించటం సాధ్యం కాలేదని చెప్పారు. మచ్చుకు కొన్ని ఆభరణాలను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, ఇటీవల మరింత పటిష్టం చేశారని చెప్పారు. నాలుగో, ఐదో ఉన్నాయి.. శ్రీవారికి ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్ర కిరీటాలతో పాటు చిన్న చిన్న ఆభరణాలు అధికంగా ఉన్నాయని బోర్డు సభ్యుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. అయితే బోర్డు సభ్యులు మాత్రం నాలుగో, ఐదో కిరీటాలు ఉన్నాయని... చిన్నవి, పెద్దవి చాలా ఉన్నాయని చెప్పటంపై దేవస్థానం అధికారులు విస్తుపోతున్నారు. చిన్న చిన్న ఆభరణాల సంగతి ఎలా ఉన్నా కనీసం శ్రీవారికి కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు సభ్యులు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దేవస్థాన సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చిన భక్తుడు
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారికి భూరి విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించి ఓ భక్తుడు ఆ దేవదేవుని పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. బెంగుళూరుకు చెందిన కన్స్ట్రక్షన్ బిజినెస్ అధినేత కొండా శ్రీనివాసరెడ్డి రూ. 2 కోట్ల చెక్కును శుక్రవారం టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి తిరుమలలో అందజేశారు. ఈ మొత్తం నగదు మొత్తాన్ని వెయ్యి కాళ్ల మండపానికి వినియోగించాలని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తిని కోరారు. అనంతరం శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.