![Nandini Ray, Gajal Srinivas Visits Tirumala Temple - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/28/nandhini-rai.jpg.webp?itok=4ARXB_Ve)
సాక్షి, తిరుమల: సినీ నటులు నందినీ రాయ్, గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వీరిని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత నందినీ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తుడికి శానిటైజేషన్ అందేలా టీటీడీ చేసిన ఏర్పాట్లను కొనియోడారు. స్వామి వారిని చాలా రోజుల తర్వాత దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార ప్రవేశం చేశానని, తర్వాత స్వామి వారిని దర్శించుకుని వెళ్లాక నాకు మొత్తం ఎనిమిది సినిమా ఆఫర్లు రావడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మళ్లీ వచ్చానన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి వైభవాన్ని చాటి చెప్తూ 40 నిమిషాల నిడివి గల పాటను రూపొందిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. (చదవండి: కానిస్టేబుల్ ఆర్షద్‌కు టీటీడీ చైర్మన్ అభినందనలు)
Comments
Please login to add a commentAdd a comment