సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బన్నీ తన కుటుంబ సభ్యులతోపాటు తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి వెంకన్నను దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బన్నీ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించాడు. (ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’)
కాగా ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక క్యూట్‌నెస్‌లో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాతో బన్నీ జోడీ కట్టనున్నాడు. ఇక ఇప్పటికే దర్శకులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఈ హీరో తాజాగా బంధువులకు, సన్నిహితులకు కూడా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. కాగా ఫిలిం జర్నలిస్టుల సంక్షేమానికిగానూ బన్నీ రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. (బన్ని- సుకుమార్ చిత్ర టైటిల్‌పై క్లారిటీ!)
Comments
Please login to add a commentAdd a comment