ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
స్టైలిష్ కపుల్‌గా ఇండస్ట్రీలో ఈ జంటకు పేరుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మాంచి ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్న స్నేహరెడ్డి తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోను షేర్‌చేస్తూ.. 'మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం.
మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం' అంటూ మొక్కలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగే స్నేహారెడ్డి యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు.. మేడమ్ సర్.. మేడమ్ అంతే. హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment