![Allu Arjun Shares Wife Sneha Reddy Daughter Arha Cute Pic - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/31/allu.jpg.webp?itok=L2i94BDX)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా చెప్పుకొవచ్చు. సినిమాలకు విరామం వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో గడపడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇక ఇంట్లో కూతురు ఆర్హ, కొడుకు ఆయాన్‌తో బన్ని చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వీరి ఫన్నీ ఫొటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియా దర్శనమిస్తూనే ఉంటాయి. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను ఆయన భార్య స్నేహా రెడ్డి షేర్ చేస్తుంటారు. తాజాగా బన్నీ.. భార్య స్నేహరెడ్డి, కూతురు ఆర్హలకు సంబంధించి ఓ ఫొటోకు షేర్ చేశాడు.
ఈ ఫొటోకు అతడు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. భార్య స్నేహా, ఆర్హలు వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న ఈ ఫొటోను ‘క్యూటీస్’ అంటూ బన్నీ షేర్ చేశాడు. ఇది చూసి ‘క్యూట్ మమ్మీతో క్యూట్ డాటర్’ అంటూ నెటిజన్లు తమ స్పందనను తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని మారేడు మిల్లీ అడవుల్లో జరుపుకుంది. ఇక ఇటీవల రెండ షెడ్యూల్‌ను కేరళ అడవుల్లో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది.
చదవండి:
మీ అందరికి రుణపడి ఉంటా.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
సురేఖవాణి కూతురికి షాకిచ్చిన నెటిజన్లు
షూటింగ్‌లో ప్రమాదం: నటుడికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment