![Allu Arjun Wishes To Wife Sneha On Marriage Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/6/aaa.jpg.webp?itok=9KDJMUG6)
టాలీవుడ్ స్టార్ కపూల్ అల్లు అర్జున్- స్నేహా రెడ్డి 2011లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ రోజుతో(శుక్రవారం) వీరి వివాహ బంధానికి తొమ్మిది సంవత్సరాలు. దీంతో అటు ప్రముఖుల నుంచి ఇటు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు బన్నీ. తన పెళ్లినాటి ఫోటోను షేర్ చేస్తూ.. ‘పెళ్లి అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. కానీ రోజు రోజూకి నీపై ప్రేమ పెరుగుతూనే ఉంది’. అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అలాగే అల్లు శిరీష్ కూడా అన్నయ్య పెళ్లి రోజున శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యపీ యానివర్సరీ లవ్ బర్డ్స్.. లవ్ యూ బోత్’ అంట్ ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు.
Happy anniversary you lovebirds! Love you both. 😘🤗 @alluarjun pic.twitter.com/SotnPv0j3T
— Allu Sirish (@AlluSirish) March 6, 2020
Comments
Please login to add a commentAdd a comment