
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్‌కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్‌లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్‌లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.
మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్‌లో అయితే ధనుష్‌తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment