Suhas's Next Writer Padmabhushan Releasing in Theatres On Feb 3rd - Sakshi
Sakshi News home page

Suhas Movie: రచయితగా మారిన కలర్‌ ఫోటో హీరో.. పోస్టర్ అదుర్స్

Published Thu, Dec 29 2022 8:06 PM | Last Updated on Thu, Dec 29 2022 9:10 PM

Suhas Movie Writer Padmabhushan Releasing in Theatres On February 3rd - Sakshi

సుహాస్ నటించిన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదల కానుంది. కలర్ ఫోటో సినిమాలో అద్భుతమైన నటనతో ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. అతను హిట్-2లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రైటర్ పద్మభూషణ్‌లో రచయితగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు చెందిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. జి.మనోహరన్ సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతమందించారు. ఈ మూవీ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement