టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది . ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుహాస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు 'గొర్రె పురాణం' చిత్రంతో సెప్టెంబర్ 20న థియేటర్‌లోకి రానున్నారు. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టిందో ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. కోర్టు, కేసులు, గొడవలు ఇలా అన్నీ ఒక గొర్రె చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment