కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
రైటర్‌గా ఓ బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేసే క్రమంలో హీరో సుహాస్ పడే కష్టాలను హిలేరియస్‌గా చూపించారు దర్శకుడు. నెలబడ్జెట్‌లో వెయ్యి రూపాయలు మిగిలిన పొంగిపోయే నాన్న, సీరియల్స్‌లో ట్విస్ట్‌లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్‌ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment