సరికొత్త కాన్సెప్ట్‌తో జనక అయితే గనక.. ఆసక్తిగా ట్రైలర్ | Suhas Latest Movie Janaka Aithe Ganaka Trailer Out Now | Sakshi
Sakshi News home page

Janaka Aithe Ganaka: సరికొత్త కాన్సెప్ట్‌తో జనక అయితే గనక.. ఆసక్తిగా ట్రైలర్

Published Wed, Oct 9 2024 1:58 PM | Last Updated on Wed, Oct 9 2024 1:58 PM

Suhas Latest Movie Janaka Aithe Ganaka Trailer Out Now

టాలీవుడ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో మరో మూవీతో అలరించేందుకు వస్తున్నాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో సినీ ప్రియులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాడు. తాజాగా సుహాస్ నటించిన చిత్రం జనక ‍అయితే గనక. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంకీర్తన హీరోయిన్‌గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ విజయదశమి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పిల్లలు పుడితే లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారుపిల్లలంటే భయపడే ఓ వ్యక్తి జీవితంగా ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి దిల్‌ రాజు మాట్లాడారు. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఈనెల 12న జనక అయితే గనక  థియేటర్లలో అలరించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement