'జనక అయితే గనక'.. ట్రైలర్ వచ్చేసింది! | Tollywood Hero Suhas Latest Movie Janaka Aithe Ganaka Trailer Out Now, Check Out Trailer Highlights Inside | Sakshi
Sakshi News home page

Janaka Aithe Ganaka Trailer: 'జనక అయితే గనక'.. ట్రైలర్ వచ్చేసింది!

Published Tue, Aug 27 2024 5:08 PM | Last Updated on Tue, Aug 27 2024 5:51 PM

Tollywood Hero Suhas latest Movie Janaka Aithe Ganaka Trailer Out Now

డిఫరెంట్‌ స్టోరీస్‌తో అభిమానులను అలరిస్తోన్న నటుడు సుహాస్. తాజాగా మరో ఆసక్తికర టైటిల్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. సుహాస్‌, సంగీర్తన జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి  నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మధ్య తరగతి వ్యక్తి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, భర్త, పిల్లలు అనే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టైటిల్‌ చూస్తేనే ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్‌ 7న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement