
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యారు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలె రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్టు కొట్టిన సుహాస్ తాజాగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అనే సినిమాతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న జిఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో సుహాస్ ఈ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ వేసవిలో మోత మోగించడానికి మల్లిగాడు వచ్చేస్తున్నాడు అంటూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రేపు(మంగళవారం) సుహాస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
My next ☺️#AmbajipetaMarriageBand First look on 11th April 🔥💥
— Suhas 📸 (@ActorSuhas) April 10, 2023
@Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official #SwechaCreations pic.twitter.com/iOqaIUGA2w
Comments
Please login to add a commentAdd a comment