రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం' | Suhas Gorre Puranam Movie Streaming Date Announced | Sakshi
Sakshi News home page

రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'

Published Mon, Oct 7 2024 4:02 PM | Last Updated on Mon, Oct 7 2024 4:11 PM

Suhas Gorre Puranam Movie Streaming Date Announced

సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.

'గొర్రె పురాణం'  చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్‌ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని ఆహా ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సుహాస్‌ బిజీగా  ఉన్నారు. సుహాస్‌ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్‌ 12న థియేటర్‌లో విడుదల కానుంది.

కథేంటంటే..
టైటిల్‌ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్‌ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్‌ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్‌ గ్యాంగ్‌  దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్‌లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.

ఆ వీడియో కాస్త వైరల్‌ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్‌ ఇంత వైరల్‌ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్‌)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement