Gorre Puranam Movie
-
మరో ఓటీటీలోకి వచ్చేసిన 'గొర్రె పురాణం'
టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోల్లో సుహాస్ ఒకడు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కానీ 'కలర్ ఫోటో' మూవీ హిట్ అయ్యేసరికి దశ తిరిగింది. ప్రస్తుతం ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ఇతడు నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)సుహాస్ 'జనక అయితే గనక' సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి యువకుడు.. తన భార్య నెల తప్పిందనే కారణంతో కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. బోల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు.మరోవైపు సెప్టెంబరులో సుహాస్ 'గొర్రె పురాణం' చిత్రం థియేటర్లలో రిలీజైంది. అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు. ఓ గొర్రె వల్ల రెండు వర్గాలు ఎలా కొట్టుకున్నాయి? అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇంట్రెస్ట్ ఉంటే లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్
వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఈసారి దసరా కాబట్టి కాస్త హడావుడి గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హడావుడిగా ఉంది. థియేటర్లలో 'వేట్టయన్', 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక', 'జిగ్రా' సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలో అయితే జాతరే అని చెప్పాలి.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)వీకెండ్ మొత్తంగా 29 సినిమాలు వస్తుండగా.. శుక్రవారం ఒక్కరోజే 14 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'మత్తు వదలరా 2', 'గొర్రె పురాణం', 'స్త్రీ 2', 'శబరి', 'వాళై' చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో స్త్రీ 2 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి. అలానే జై మహేంద్రన్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్, సర్ఫిరా అనే హిందీ సినిమా కూడా ఉన్నంతలో చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 11)నెట్ఫ్లిక్స్మత్తు వదలరా 2 - తెలుగు సినిమాఇన్ హెర్ ప్లేస్ - స్పానిష్ మూవీలోన్లీ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమాఅప్ రైజింగ్ - ఇంగ్లీష్ సినిమాఏ వర్చువస్ బిజినెస్ - కొరియన్ సిరీస్ (అక్టోబరు 12)లవ్ ఈజ్ బ్లైండ్: హబిబి - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఔటర్ బ్యాంక్ సీజన్ 4 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)టాంబ్ రైడర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)ద లైఫ్ అండ్ మూవీస్ ఆఫ్ ఎర్సన్ కునేరి సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)దట్ కైండ్ ఆఫ్ లవ్ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)తెమురన్ - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)మాన్స్టర్ హై 2 - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)ద మేరియా సోల్డాడ్ కేసు - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)జీ5వేద - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాలాంధర్ - తమిళ సినిమాగొర్రె పురాణం - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సన్ నెక్స్ట్శబరి - తెలుగు డబ్బింగ్ సినిమాఅమెజాన్ ప్రైమ్గుటర్ గూ సీజన్ 2 - హిందీ సిరీస్స్త్రీ 2 - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సిటాడెల్: డయానా - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)హాట్స్టార్రిటర్న్ టూ లస్ సబనాస్ - స్పానిష్ సిరీస్సర్ఫిరా - హిందీ సినిమావాళై- తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబరు 12)జియో సినిమాటీ కప్- ఇంగ్లీష్ సిరీస్సోనీ లివ్జై మహేంద్రన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్రాత్ జవానీ హై - హిందీ సిరీస్జిందగీనామా - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ ప్లస్ టీవీడిస్క్లెయిమర్ - ఇంగ్లీష్ సిరీస్ద లాస్ట్ ఆఫ్ ద సీ ఉమెన్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?) -
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలో 'గొర్రె పురాణం'
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా వెళ్లడించింది. అక్టోబర్ 10 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వరుస సినిమాలతో సుహాస్ బిజీగా ఉన్నారు. సుహాస్ కొత్త సినిమా 'జనక అయితే గనక' దసర సందర్భంగా అక్టోబర్ 12న థియేటర్లో విడుదల కానుంది.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి రానున్న 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే నటుడిగా సుహాస్‌కు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు సాధించలేదు.'గొర్రె పురాణం' సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు. తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్ ఈ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే, అక్టోబర్ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గొర్రెతో సినిమా.. మంచి ప్రయత్నమే!
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. వాస్తవానికి ఇందులో హీరో గొర్రె అనే చెప్పాలి. సినిమా మొత్తంలో సుహాస్ ఓ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. మిగతా భాగం అంతా గొర్రె చుట్టే తిరుగుతుంది. ఈ కథ బాగున్నప్పటికీ హీరో సుహాస్ ప్రమోషన్స్‌కి రాకపోవడం.. పబ్లిసిటీ అంతగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఓ బోల్డ్ అటెంప్ట్ చేశాడు. (చదవండి: గొర్రె పురాణం మూవీ రివ్యూ)గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఎక్కువైందనే విమర్శలు మాత్రం వస్తున్నాయి. -
Gorre Puranam Review: ‘గొర్రె పురాణం’ మూవీ రివ్యూ
టైటిల్: గొర్రె పురాణంనటీనటులు: సుహాస్, పోసాని కృష్ణ మురళి, రఘు తదితరులునిర్మాత: ప్రవీణ్ రెడ్డిదర్శకత్వం: బాబీసంగీతం: పవన్ సీహెచ్సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగంవిడుదల తేది: సెప్టెంబర్ 21, 2024యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే జోష్‌లో ‘గొర్రెపురాణం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. రఫిక్ అనే ఓ ముస్లీం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది. రఫిక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది. ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ టెంపుల్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు. ఆ వీడియో కాస్త వైరల్ అయి..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి? గొర్రె అతనికి ఎలాంటి సహాయం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా ఒక జంతువునే హీరో. కథంతా గొర్రె చుట్టే నడిపిస్తూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు? తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు? అనేది సెటైరికల్‌గా తెరపై చూపించారు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. బహుశా బడ్జెట్ ప్రాబ్లమ్ కావొచ్చ కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదా సీదాగా తీసేశారు. ఓ మర్డర్ సీన్‌తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్‌తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది. గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్టాఫ్ సాగుతుంది. ఒక్క సీన్ మీనహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించదు. ఇక ద్వితియార్థంలో ఎక్కువ భాగం జైలు, కోర్టు సీన్లతోనే సాగుతుంది. రవి ప్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. కోర్టు సీన్లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. లాజిక్స్ వెతక్కుకుండా చూస్తే..‘గొర్రె పురాణం’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి. ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్, మరొక గొర్రెకు గెటప్ శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరు ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ చిత్రంలోసుహాస్ది కీలక పాత్ర. నిడివి తక్కువే అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్. ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హిందూ వాదిగా రఘు, జడ్జీగా పొసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పవన్ సీహెచ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. నిడివి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.