మరో ఓటీటీలోకి వచ్చేసిన 'గొర్రె పురాణం' | Suhas Gorre Puranam Movie OTT Streaming Amazon Prime | Sakshi
Sakshi News home page

OTT Latest: ఒకేరోజు ఓటీటీల్లో సుహాస్ రెండు సినిమాలు

Published Fri, Nov 8 2024 12:25 PM | Last Updated on Fri, Nov 8 2024 12:58 PM

Suhas Gorre Puranam Movie OTT Streaming Amazon Prime

టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోల్లో సుహాస్ ఒకడు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టాడు కానీ 'కలర్ ఫోటో' మూవీ హిట్ అయ్యేసరికి దశ తిరిగింది. ప్రస్తుతం ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ఇతడు నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)

సుహాస్ 'జనక అయితే గనక' సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి యువకుడు.. తన భార్య నెల తప్పిందనే కారణంతో కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. బోల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు.

మరోవైపు సెప్టెంబరులో సుహాస్ 'గొర్రె పురాణం' చిత్రం థియేటర్లలో రిలీజైంది. అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు. ఓ గొర్రె వల్ల రెండు వర్గాలు ఎలా కొట్టుకున్నాయి? అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇంట్రెస్ట్ ఉంటే లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement