సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. వాస్తవానికి ఇందులో హీరో గొర్రె అనే చెప్పాలి. సినిమా మొత్తంలో సుహాస్ ఓ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. మిగతా భాగం అంతా గొర్రె చుట్టే తిరుగుతుంది. ఈ కథ బాగున్నప్పటికీ హీరో సుహాస్ ప్రమోషన్స్‌కి రాకపోవడం.. పబ్లిసిటీ అంతగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఓ బోల్డ్ అటెంప్ట్ చేశాడు.
(చదవండి: గొర్రె పురాణం మూవీ రివ్యూ)
గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.
సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఎక్కువైందనే విమర్శలు మాత్రం వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment