‘కలర్‌ ఫోటో’పై అల్లు అర్జున్‌ ప్రశంసలు | Allu Arjun Praises Colour Photo Movie In Twitter | Sakshi
Sakshi News home page

‘కలర్‌ ఫోటో’పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్

Published Sat, Oct 31 2020 7:43 PM | Last Updated on Sat, Oct 31 2020 7:54 PM

Allu Arjun Praises Colour Photo Movie In Twitter - Sakshi

కమెడియన్‌ సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కలర్‌ ఫోటో’ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీ ‘ఆహా’లో ఆక్టోబర్‌ 23న విడుదలైన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ లవ్ స్టోరీ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఎంతో మంది మనసులను దోచుకుంది. అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: పుష్ప షూటింగ్‌; వైజాగ్‌కు బన్నీ, రష్మిక

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. సినిమా అద్భుతంగా ఉందంటూ దర్శకుడు సందీప్‌ను, చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన బన్నీ... ‘వెరీ స్వీట్ లవ్ స్టోరీ.. అద్భుతమైన మ్యూజిక్, ఎమోషన్స్, పెర్ఫామెన్స్ అన్నీ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినందుకు సంతోషంగా ఉంది. అంటూ ట్వీట్ చేశారు. అలాగే చిత్ర యూనిట్‌ను కలిసి ఓ మొక్కను బహుమతిగా అందించాడు. చదవండి: క‌ల‌ర్ ఫొటో రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement