కలర్ ఫొటో.. ఉత్తమ చిత్రంగా ఈ మధ్యే జాతీయ అవార్డు అందుకుంది. దీంతో సినిమా హీరో సుహాస్, దర్శకుడు సందీప్ రాజ్‌ల పేర్లు ఒక్కసారిగా మార్మోగిపోయాయి. తమ సినిమాకు ఇంతటి గౌరవం లభించినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా సుహాస్, సందీప్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'కలర్ ఫొటో షూటింగ్ సమయంలో ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని, ఇందులో సునీల్ హీరో అని చెప్పేవాడిని. నేను, హర్ష క్యారెక్టర్స్ వేస్తున్నామని మా వాళ్లందరికీ చెప్పేవాడిని. నేను హీరో అని చెప్పడం ఎందుకని అలా చేశాను' అని చెప్పుకొచ్చాడు సుహాస్. 'కలర్ ఫొటోకు చాందినిని హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. ఆ అమ్మాయి ఇంతకుముందు చేసిన సినిమాలు చూశావు కదా! ఒక నిర్మాత అయితే సుహాసా... రాహుల్ రామకృష్ణతో చేయొచ్చు కదా, నేను బడ్జెట్ పెడతాను అన్నాడు. సుహాస్ ఎందుకు అని అడిగినా పర్వాలేదు, కానీ అతడు అవసరమా? అని కొందరు చీప్ లుక్ ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశాడు సందీప్ రాజ్.
చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్
రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment