'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్‌ | Hero Suhas Talk About Prasannavadanam Movie | Sakshi
Sakshi News home page

'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్‌

May 1 2024 7:07 PM | Updated on May 2 2024 11:57 AM

Hero Suhas Talk About Prasannavadanam Movie

‘ప్రసన్న వదనం’ ఫస్ట్‌ కాపీ నిన్ననే చూశాను. సినిమా  థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’.  స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు.

 ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్‌. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్‌ రాశిసింగ్‌. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్‌ రెడ్డి, జెస్‌ మణికంఠ అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement