‘‘ప్రసన్న వదనం’ మూవీ ఫేస్ బ్లైండ్‌నెస్ (ముఖాలను గుర్తు పట్టడంలో ఇబ్బంది) కాన్సెప్ట్‌తో రూపొందింది. డైరెక్టర్ అర్జున్‌గారు సినిమా తీసిన విధానం, స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. ఈ సినిమా తొలి కాపీ చూశాక భావోద్వేగం, ఆనందంతో డైరెక్టర్‌ని హత్తుకున్నాను. ఇంత అద్భుతంగా వచ్చిన మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని సుహాస్ అన్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రసన్న వదనం’.
జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రేడియో జాకీ పాత్ర చేశాను. అతను తనకున్న ఫేస్ బ్లైండ్‌నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ చిత్రకథ. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అవి చేయడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు నిర్మాతలు. ప్రస్తుతానికి నా చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment