
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యారు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలె ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా మరోసారి హీరోగా ‘రైటర్ పద్మభూషణం’గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. లైఫ్‌లో కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్లకు, కనీసం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకుండా చేసుకున్నాను. ఇక పెళ్లి తర్వాత కెరీర్ ఊపందుకుంది. సినిమాల్లో వరుస ఛాన్సులు వచ్చాయి.
రీసెంట్‌గా ఫ్యామిలీ డ్రామా సిరీస్‌లో సైకోగా నటించడంతో నా వైఫ్ చాలా బయపడింది. మూడు రోజులు నన్ను ఇంటికి కూడా రానివ్వకుండా ఆఫీస్‌లోనే పడుకోమని చెప్నింది. ఆ తర్వాత ఇంట్లో నార్మల్‌గా నవ్వుతున్నా సరే.. కాస్త భయపడేదంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment