ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ | Suhas Prasanna Vadanam Movie OTT Release Details Latest | Sakshi
Sakshi News home page

Prasanna Vadanam OTT: 'ప్రసన్న వదనం' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Fri, May 17 2024 5:53 PM | Last Updated on Fri, May 17 2024 6:50 PM

Suhas Prasanna Vadanam Movie OTT Release Details Latest

మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్‪‌కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్‌గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)

'ప్రసన్నవదనం' కథేంటి?
సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్‌నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు.  అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.

(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్‍‌లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement